రాజంపేట, ఆగస్టు 13 (తొలి కిరణం ప్రతినిధి): స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా రాజంపేట పట్టణంలో ఏబీవీపీ, భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో గురువారం భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు.
సుమారు 100 మీటర్ల పొడవైన మువ్వన్నెల జెండాను విద్యార్థులు చేతపట్టి ఆర్అండ్బీ బంగ్లా నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా సాగారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపిస్తూ, ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో పట్టణంలో దేశభక్తి భావాన్ని చాటారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, జాతీయ జెండా ప్రాధాన్యతను తెలియజేస్తూ విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలో ర్యాలీ సందర్భంగా దేశభక్తి వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు, ఏబీవీపీ కడప జిల్లా అధ్యక్షులు కోడూరు మల్లికార్జున, వంశీ, బీజేవైఎం టౌన్ అధ్యక్షులు పవన్, బీజేపీ పట్టణ, రూరల్ అధ్యక్షులు, కార్యదర్శులు రేవూరి అఖిల్, సీనియర్ నాయకులు ఆదినారాయణ, గిరీష్, బీజేపీ యువ నాయకుడు పోతుగుంట జగదీష్ నాయుడు, రామయ్య, ఎస్సీ మోర్చా జోనల్ ఇన్చార్జ్ రమణయ్య, ముఖ్య కార్యకర్తలు చరణ్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


