నాగర్కర్నూల్: దివ్యాంగుల వైకల్య నిర్ధారణ ప్రక్రియను సులభతరం చేసి, వారికి అవసరమైన సదరం ధ్రువపత్రాలను త్వరగా అందించాలనే లక్ష్యంతో నాగర్కర్నూల్ మెడికల్ కాలేజీలో సదరం మూల్యాంకన కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి చేతుల మీదుగా కేంద్రం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులకు అవసరమైన సేవలు వారి సమీపంలోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. సదరం కేంద్రం ద్వారా దివ్యాంగులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. సదరం ధ్రువపత్రాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలను పొందేందుకు దివ్యాంగులకు మరింత సౌలభ్యం కలుగుతుందని తెలిపారు.
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలో వైకల్య నిర్ధారణ ప్రక్రియ పారదర్శకంగా, సులభతరంగా జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, కౌన్సిలర్లు అనంత అలివేలమ్మ, పడిగే శంకర్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


