నాగర్కర్నూల్ జిల్లా: ప్రతినిధి ఆవంచ సాల్వాచారి (తొలి కిరణం న్యూస్)
హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. నాగర్కర్నూల్లో జిల్లా స్థాయి ముమ్మర ఐఈసీ ప్రచార కార్యక్రమం–2026ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్ఐవీపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, వైరస్ ఎలా వ్యాపిస్తుంది, ఎలా వ్యాపించదనే అంశాలపై శాస్త్రీయ అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత హెచ్ఐవీపై సరైన సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకుండా వైద్య నిపుణులు, ఆరోగ్యశాఖ అందించే విశ్వసనీయ సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని కోరారు.
హెచ్ఐవీతో జీవిస్తున్న వ్యక్తుల పట్ల వివక్ష, అవమానం, నిర్లక్ష్యం చూపకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. వారికి వైద్య సేవలతో పాటు మానసిక, కుటుంబ, సామాజిక మద్దతు అందించాల్సిన అవసరం ఉందన్నారు.
పట్టణాలు, గ్రామాలు, విద్యాసంస్థలు, జనసమ్మర్థ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అవగాహన కార్యక్రమాలను ఒక్కరోజుకే పరిమితం చేయకుండా నిరంతరం కొనసాగించాలని సూచించారు. “Be Positive To Prevent HIV Positive” నినాదంతో చేపడుతున్న ప్రచారంలో హెచ్ఐవీ నివారణ, ముందస్తు పరీక్షలు, వైద్య సేవలు, చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని అన్నారు.
అవగాహన ర్యాలీ ప్రారంభం
అనంతరం నాగర్కర్నూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుంచి ప్రారంభమైన అవగాహన ర్యాలీని కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అవగాహన నినాదాలతో ప్రజలకు హెచ్ఐవీ నివారణపై సందేశాన్ని అందించారు.
కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణ, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రవి నాయక్, విద్యార్థులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, అధికారులు

