బిజినపల్లి: బిజినపల్లి కేజీబీవీలో కలెక్టర్ మెదపు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లో అభ్యాసన తీరును పరిశీలించిన కలెక్టర్, పాఠశాల పరిసరాలు, వంటగది తదితర ప్రాంతాలను పరిశీలించారు. విద్యార్థులకు భద్రత, ఆరోగ్య పరిరక్షణపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రభుత్వం మెను ప్రకారం భోజనం పెట్టాలని, విద్యాబోధనతో పాటు పాఠు మౌలిక వసతులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకుని, సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో తదితర అధికారులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

