• సమస్యలను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్‌కు వినతి
• విద్యార్థుల ఇబ్బందులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి
బిజినపల్లి: విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ బిజినపల్లి–పాలెం శాఖ ఆధ్వర్యంలో బిజినపల్లి మండల తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ పాలెం టౌన్ సెక్రటరీ విష్ణు నాయుడు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. విద్యార్థుల సమస్యలు వారి విద్యాభ్యాసానికి ఆటంకంగా మారకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల హక్కులు, విద్యా రంగ సమస్యలు, మౌలిక వసతుల కోసం ABVP నిరంతరం విద్యార్థుల పక్షాన పోరాడుతుందని తెలిపారు. కార్యక్రమంలో రమేష్, ఆకాష్, సైదుల్, వెంకటేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


