ఖమ్మం: ఉస్మానియా విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవ కార్యక్రమం హైదరాబాద్లోని ఠాగూర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం నగరం పంపింగ్ వెల్ రోడ్ ప్రాంతానికి చెందిన పెద్దపల్లి యాకయ్య, సావిత్రి దంపతుల కుమార్తె పెద్దపల్లి తేజస్వి తెలుగు విభాగంలో పీహెచ్డీ పట్టా అందుకున్నారు.
డా. నాళేశ్వరం శంకరం పర్యవేక్షణలో “తెలంగాణ రచయిత్రుల కథా సాహిత్యం–స్త్రీ జీవన చిత్రణ (1991–2015)” అనే అంశంపై ఆమె చేసిన పరిశోధనకు గాను ఈ డాక్టరేట్ ప్రదానం చేశారు. భారత్ బయోటెక్ చైర్మన్ డా. కృష్ణ ఎం. ఎల్ల చేతుల మీదుగా తేజస్వి పీహెచ్డీ పట్టాను స్వీకరించారు.
ఈ సందర్భంగా అధ్యాపకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తేజస్విని అభినందించి, ఆమె భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


