గుడిపల్లి, సెప్టెంబర్ 22: హైదరాబాద్‌లోని నాగోల్ శుభం కన్వెన్షన్ హాల్లో ఈనెల 27న నిర్వహించనున్న రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) 80వ వసంతోత్సవాలను విజయవంతం చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. రమేష్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు.
మంగళవారం గుడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంఘం నాయకులు, ఉపాధ్యాయులతో కలిసి ఎస్టీయూ వసంతోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కే. రమేష్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యానికి పూర్వం 1947 జూన్ 9న ఆవిర్భవించిన తొలి ఉపాధ్యాయ సంఘంగా ఎస్టీయూ నాటి నుంచి నేటి వరకు ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమంతో పాటు బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల అభ్యున్నతికి సంఘం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, విద్యా ప్రమాణాల పెంపు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న డీఏలన్నింటినీ విడుదల చేయాలని, 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరారు.
ఈనెల 27న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి 80వ వసంతోత్సవాలకు జిల్లా నుంచి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కే. రమేష్ కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సాయిబాబు, పాఠశాల ఉపాధ్యాయులు సురేందర్, భాస్కర్, అజీమ్, రఘునందన్ గౌడ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


