నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడి బాధ్యత ఎంతో కీలకమని అన్నారు. దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం కూచుకుళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రైసైకిళ్లను ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పంపిణీ చేశారు. దివ్యాంగులకు అండగా నిలవడం, వారి జీవనోపాధికి సహకరించడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు, కౌన్సిలర్లు, మండల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


