నాగర్కర్నూల్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన డీ-8 కెనాల్ పరిధిలోని కాల్వలను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. థుడుకుర్తి దగ్గారా ప్రధాన కాల్వ నుంచి సాకరపల్లి, ఏదుల్ల, గోపాలపేట, రేవల్లి, సింగాయపల్లి, తురకవల్లి, గోపులపురం కాల్వలను పరిశీలించి నీటి ప్రవాహం, కాల్వల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు విడుదల చేస్తున్న నీరు, ఆయకట్టు పరిధిపై సాగునీటిపారుదల శాఖ అధికారులను మంత్రి ఆరా తీశారు. ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు చేరేలా చర్యలు తీసుకోవాలని, ఎల్ఎన్లో ప్రభావం నేరుగా ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టుకోవాలని మంత్రి సూచించారు.
అందుబాటులో ఉన్న నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ సాగు విస్తీర్ణం పెంచుకోవాలని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ అధిక విస్తీర్ణంలో పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు నీటి విడుదల, నీటి ప్రవాహం, ఆయకట్టు పరిధిపై సాగునీటిపారుదల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. నీరు వృథా కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంతో పాటు, ఆయకట్టు చివరి భూములకు సైతం సమర్థంగా నీరు అందేలా చూడాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి వెంట వనపర్తి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్, కోడేరు మాజీ ఎంపీపీ రామ్మోహన్రావు, సాగునీటిపారుదల శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


