రైల్వేకోడూరు, సెప్టెంబర్ 17: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు పట్టణంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం చంగల్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్ఎస్ గోయంక బస్సు షెల్టర్ సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గడ్డం చంగల్ రాజు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెలరోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. పేదలకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కిసాన్ మోర్చా ఇన్చార్జి తోట శ్రీనివాసులు, సీనియర్ కార్యకర్తలు శంకర్రాజు, వాకచర్ల సుబ్బారావు, బత్తల సుబ్రహ్మణ్యం, కోడూరు మండల అధ్యక్షుడు సాయం శ్రీధర్, ఓబులవారిపల్లె మండల అధ్యక్షుడు రూపేష్ రెడ్డి, మండల అధ్యక్షుడు బాపూజీ, అసెంబ్లీ ఆఫీస్ సెక్రటరీ సుబ్బారావు, జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి కుప్పాల జ్యోతి తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


