తెలకపల్లి: మండల కేంద్రంలోని గణేష్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ రూ.67,777కు రిలాక్స్ కేఫ్ సభ్యులు దక్కించుకున్నారు. తెలకపల్లిలో ఈ ఏడాది అత్యధిక ధర పలికిన లడ్డూగా ఇది నిలిచింది.
అదేవిధంగా నిర్వహించిన లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా 10 కేజీల లడ్డూను దండు కార్తీక్ అనే బాలుడు, ద్వితీయ బహుమతిగా 3 తులాల వెండి బహుమతిని జాహ్నవి అనే బాలిక దక్కించుకున్నారు. లక్కీ డ్రాలో తమ పేర్లు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు వారు తెలిపారు. వినాయకుడి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని కోరుకున్నారు.
అనంతరం కాలనీవాసులు నృత్యాలతో వినాయకుడిని ఘనంగా ఊరేగించి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


