చిట్వేల్, తొలి కిరణం న్యూస్: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండల పరిధిలోని తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన ప్రజాసేవకుడు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 66వ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. తన నివాసంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరుల సమక్షంలో ఆయన జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
ప్రజా సేవే లక్ష్యంగా...
తన తండ్రి నాగిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తూ ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారని, ఆయన సేవా స్ఫూర్తితో తాను కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ తన వంతు సేవ చేయడం ఆనందంగా ఉందని నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
జన్మదిన సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు ఆయనను సన్మానించి పుష్పగుచ్ఛాలు అందించి, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.
శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
తన 66వ జన్మదినాన్ని పురస్కరించుకుని తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనపై అభిమానంతో వచ్చి ఆశీర్వదించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, విలేకరులు, శ్రేయోభిలాషులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు, అభిమానుల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా ముగిశాయి.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


