చిట్వేల్, సెప్టెంబర్ 7 (తొలి కిరణం న్యూస్):
తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం పరిధిలోని నగిరిపాడు ఉప్పరపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతారాముల ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు వైఎస్సార్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, మండల అధ్యక్షులు రామిరెడ్డి, ధ్వజారెడ్డి, ఉప సర్పంచ్ తోట శివసాయి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.
నూతన విగ్రహాలకు ప్రత్యేక పూజలు
నూతనంగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్ఠించేందుకు సీతారాముల విగ్రహాలను రామిరెడ్డి, ధ్వజారెడ్డి స్వయంగా కొనుగోలు చేసి సమకూర్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సీతారాముల ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.
ఆలయ అభివృద్ధికి సహకారం
ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, సీతారాముల ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఐక్యతతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు.
ఘనంగా సన్మానం
కార్యక్రమానికి హాజరైన రామిరెడ్డి, ధ్వజారెడ్డితో పాటు పలువురు నాయకులను గ్రామస్తులు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు లింగం లక్ష్మీకర్, లింగం పద్మాకర్, గోపి, చంగల్‌రెడ్డి, సుబ్రమణ్యం, రాజు, కృష్ణారెడ్డి, రమణారెడ్డి, గ్రామ ప్రముఖులు బత్తల సుబ్రహ్మణ్యం, శివాజీ, తిమ్మయ్య, గారిపల్లి పెంచలయ్య, సింగమల ప్రభాకర్, సింగమల ఆనంద్‌రావు, జంగిటి పెంచలయ్య, జింగిటి ప్రసాద్, గౌరీ, జ్యోతి, శివయ్య, జ్యోతి చంద్ర తదితరులతో పాటు కార్యకర్తలు, యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



