హైదరాబాద్, ఆగస్టు 28: తీవ్ర వెన్నెముక సమస్యతో బాధపడుతూ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మహిళకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రూ.5 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) మంజూరైంది. సీఎం ప్రజావాణి స్టేట్ ఇన్చార్జ్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పేషెంట్ అన్నసారం పద్మమ్మ కుమారుడు రాజశేఖర్‌రెడ్డికి ఎల్ఓసీని అందజేశారు.
శుక్రవారం మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన 251వ సీఎం ప్రజావాణి కార్యక్రమానికి నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పెద్రిపాడ్ గ్రామానికి చెందిన రాజశేఖర్‌రెడ్డి హాజరై తన తల్లి అనారోగ్య సమస్యను చిన్నారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నిమ్స్ వైద్యులు అందించిన ఎస్టిమేషన్, రోగి వివరాలను సీఎం కార్యాలయానికి పంపించి ఎల్ఓసీ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
స్పందించిన సీఎం కార్యాలయం రూ.5 లక్షల ఎల్ఓసీ మంజూరు చేస్తూ నిమ్స్ డైరెక్టర్‌కు లేఖ పంపింది. పేషెంట్‌కు డబ్బులు లేకుండానే చికిత్స అందించాలని, చికిత్స అనంతరం బిల్లులను సీఎం కార్యాలయానికి పంపాలని ఆదేశించింది.
ప్రజావాణిలో సమస్యను వివరించిన కొన్ని గంటల్లోనే ఎల్ఓసీ మంజూరు కావడంతో పద్మమ్మ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యపై వెంటనే స్పందించి ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకున్న డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డికి పద్మమ్మ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


