పాలెం: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని పాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలెం బస్టాండ్ సమీపంలోని చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహానికి గ్రామ సర్పంచ్ బోనాసి రామకృష్ణ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోవింద్ శ్రీనివాసులు, చాకలి ఎస్సీ సాధన సమితి జిల్లా అధ్యక్షులు గోవింద్ శేఖర్, వార్డు సభ్యులు గోవింద్ కాశన్న, సత్తయ్య, వెంకటయ్య, రవీందర్ రెడ్డి, స్వామి, గ్రామ పెద్దలు, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మకు నివాళులర్పించారు.
చాకలి ఐలమ్మ చేసిన పోరాటం, ఆమె ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


