బిజినపల్లి: మండలంలోని నందివడ్డెమన్ గ్రామంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం మండల అధ్యక్షులు వేముల సత్యశీలసాగర్ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం దేశ్ముఖ్లు, భూస్వాములు, నిజాం పాలనకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ వీరోచిత పోరాటం చేసిన గొప్ప నాయకురాలని కొనియాడారు. 1940 ప్రాంతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని భూపోరాటం చేసిన ధైర్యశాలి ఐలమ్మ అని పేర్కొన్నారు.
పేదరికం, సామాజిక వివక్షను ఎదుర్కొంటూనే బహుజన రైతులు, కూలీల హక్కుల కోసం ఆమె పోరాడారని అన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా దొరలు, భూస్వాములు, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఐలమ్మ చరిత్రను నేటి సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుగుణమ్మ, ఉప సర్పంచ్ నాగరాజ్, సభాధ్యక్షులు రిమోద్దుల రమేష్, శ్రీరాములు, శివశంకర్, చిన్న రాములు, బంగారయ్య, అరుణ్, కర్ణాకర్, మహిళలు, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


