నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
చాకలి ఐలమ్మ తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేసి, అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా నిలిచారని నాయకులు పేర్కొన్నారు. భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఐలమ్మ పోషించిన పాత్రను స్మరించుకుంటూ ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సాకలి శీను పాల్గొనగా, నెల్లికంటి మహేశ్వర్ రెడ్డి, అల్లుడు బెక్కరి శివ, సత్యశీలసాగర్, బాలమసన్ తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మకు ఘన నివాళులర్పించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


