కుత్బుల్లాపూర్: దుందిగల్ డివిజన్ పరిధిలోని చర్చిగాగిల్లాపూర్ (214)లో రూ.40.50 లక్షల నిధులతో చేపట్టనున్న స్మశాన వాటిక అభివృద్ధి పనులకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి, ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులను చేపడుతున్నామని పేర్కొన్నారు.
రూ.40.50 లక్షలతో చేపడుతున్న స్మశాన వాటిక అభివృద్ధి పనులతో అక్కడ అవసరమైన మౌలిక వసతులు మరింత మెరుగుపడనున్నాయని అన్నారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు జక్కల మల్లేష్ యాదవ్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు బొట్ల విజయ్ కుమార్, డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు చెవిటి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కావలి గణేష్, కావలి శశి కుమార్, ఆకుల ప్రేమ్, శ్రీకర్ రెడ్డి, మైనార్టీ నాయకులు నయీమ్, మహేందర్ యాదవ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


