తిమ్మాజిపేట: తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో గుడిసెల్లో నివసిస్తున్న 34 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగులను నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు సొంత ఇళ్లు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. లబ్ధిదారుల్లో కప్పేరి మల్లేష్, కప్పిరి లక్ష్మి, కొండపల్లి అంజమ్మ (మారేపల్లి), పాలమూరు గౌరమ్మ (మరికల్) తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో తిమ్మాజిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలుక వివేక్ రెడ్డి, శ్రీనివాస్ బౌదుర్, డీసీసీ జిల్లా జనరల్ సెక్రటరీ వెంకట్రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లయ్య గౌడ్, మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


