నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సార్వత్రిక అధ్యయన కేంద్రం ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం ఉందని కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్, అధ్యయన కేంద్రం సమన్వయకర్త అంజయ్య తెలిపారు. శనివారం కళాశాల ఆవరణలో డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్, ఐటీఐ లేదా ఏదైనా రెండేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసిన వారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీలో చేరేందుకు అర్హులని తెలిపారు. ఉద్యోగాలు, కుటుంబ పరిస్థితులు, ఇతర కారణాలతో ఉన్నత విద్యను కొనసాగించలేకపోయిన వారికి ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చదివే అవకాశం ఉందన్నారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఈ నెల 30వ తేదీలోగా డిగ్రీలో చేరాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఉద్యోగులు, గృహిణులు, యువతీ యువకులు తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించి భవిష్యత్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.
డిగ్రీలో ప్రవేశం పొందేందుకు ఆసక్తి ఉన్న వారు నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 7382929779 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



