హైదరాబాద్, ఆగస్టు 26: హైదరాబాద్ నగరంలో ఆగస్టు 29 నుంచి రాత్రి వేళల్లో సిటీ బస్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు TGSRTC ప్రకటించింది. నగరంలోని ఆరు ప్రధాన మార్గాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ నైట్ బస్ సర్వీసులు నడపనున్నారు.
ఐటీ ఉద్యోగులు, నైట్ షిఫ్ట్‌లలో పనిచేసే సిబ్బంది, ఇతర ఉద్యోగులు, ఆలస్యంగా ఇళ్లకు చేరుకునే ప్రయాణికులకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను బట్టి ప్రతి 30 నిమిషాల నుంచి గంట వ్యవధిలో బస్సులను నడపనున్నట్లు సంస్థ వెల్లడించింది.
రాత్రి వేళల్లో ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందించడమే లక్ష్యంగా ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు TGSRTC తెలిపింది.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


