అల్వాల్, అక్టోబర్ 12 (తొలి కిరణం న్యూస్): తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్ సర్కిల్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 26వ రోజుకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు న్యాయం చేయాలని దీక్షా శిబిరం వేదికగా నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసి, ఉద్యమంలో ముందుండి పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి, వారికి తగిన గౌరవం కల్పించాల్సిన బాధ్యత ఉందని నాయకులు పేర్కొన్నారు. ఉద్యమకారుల సంక్షేమానికి సంబంధించిన విధివిధానాలను త్వరితగతిన ఖరారు చేసి, అర్హులైన వారందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
26వ రోజు దీక్షలో పాసుల ముత్యాలు, అంబర్పేట విద్యార్థి నాయకుడు నిఖిల్ కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో పటోళ్ల సురేందర్ రెడ్డి, పుట్నాల కృష్ణ, మంద శోభన్, అనంతుల సంతోష్, శేరుపల్లి మల్లేష్, సంఘమేశ్వర్, సత్తయ్య తదితరులు పాల్గొని తెలంగాణ ఉద్యమకారులకు సంఘీభావం తెలిపారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


