నాగర్‌కర్నూల్ జిల్లా, అక్టోబర్ 7: అచ్చంపేట సబ్ డివిజనల్ ట్రెజరీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. మెడికల్ లీవ్ అనంతరం బిల్లులు, భత్యాల ప్రక్రియ పూర్తి చేసేందుకు రూ.25 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ అకౌంటెంట్ కందడ వెంకటయ్యను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
లంచంలో భాగంగా రూ.3 వేల నగదు చెల్లించగా, మిగిలిన రూ.22 వేల మొత్తాన్ని ఫోన్‌పే ద్వారా చెల్లించినట్లు సమాచారం. లంచం స్వీకరించినట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు వెంకటయ్యను పట్టుకున్నారు.
అనంతరం అచ్చంపేట సబ్ డివిజనల్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పట్టుబడిన నిందితుడిని నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


