సికింద్రాబాద్, అక్టోబర్ 6:
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 7న శోభా గార్డెన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్ బీజేపీ నాయకులు తెలిపారు.
2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ అనంతరం దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజా జీవితంలో 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నాయకులు వెల్లడించారు.
ఈ సందర్భంగా మోదీ నాయకత్వంలో దేశంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతుల పురోగతి, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి లభించిన గుర్తింపు తదితర అంశాలను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. అలాగే ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు సంబంధించిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
అక్టోబర్ 7న శోభా గార్డెన్లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


