తెల్కపల్లి: గ్రామానికి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) ఎం.డి. అహ్మద్ గత 24 సంవత్సరాలుగా భారత సైన్యంలో సేవలందిస్తున్నారు. విధి నిర్వహణలో చూపిన ధైర్యసాహసాలు, కర్తవ్యనిష్ఠ, దేశం పట్ల అంకితభావంతో విశిష్ట సేవలు అందిస్తున్న ఆయనను ఉత్తర కమాండ్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక “ప్రశంసా పత్రం” పురస్కారంతో సత్కరించారు.
దేశ సేవలో ఆయన చూపిన ధైర్యం, క్రమశిక్షణ, అంకితభావాన్ని గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందించారు. 24 ఏళ్లుగా భారత సైన్యంలో సేవలందిస్తున్న ఎం.డి. అహ్మద్‌కు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించడం కుటుంబ సభ్యులతో పాటు తెల్కపల్లి గ్రామ ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. దేశ సేవలో ఆయన అందిస్తున్న సేవలు యువతకు స్ఫూర్తిదాయకమని గ్రామస్థులు పేర్కొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


