తెలకపల్లి: మండల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (CPS) ఉద్యోగుల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు నూతన పెన్షన్ విధానం (CPS)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (OPS)ను అమలు చేయాలని ఉద్యోగుల కమిటీ డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ.. 2004 తర్వాత నియామకమైన ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 23న ఆదివారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించనున్న బహిరంగ సభకు మండలంలోని ప్రతి ఉద్యోగి తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. CPS రద్దు, OPS అమలు కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బి. జైపాల్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, కోశాధికారి రవి, ఉపాధ్యక్షులు రమేష్, కళ్యాణ్‌తో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

