చిట్వేల్, ఆగస్టు 19 (తొలి కిరణం): పాఠశాల బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆరోపణలపై 60 ఏళ్ల వ్యక్తిపై చిట్వేల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం గట్టుమీదపల్లెకు చెందిన నాగిశెట్టి వెంకటసుబ్బయ్య (60) పాఠశాల సమీపంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి బాలికలను తన ఇంటి వద్దకు పిలిపించి, వారితో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు.
పాఠశాలలో నిర్వహించిన ‘గుడ్ టచ్–బ్యాడ్ టచ్’ అవగాహన కార్యక్రమంలో బాలికలు ఈ విషయాన్ని ఉపాధ్యాయురాలి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చిట్వేల్ పోలీస్ స్టేషన్లో నాగిశెట్టి వెంకటసుబ్బయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలికల భద్రతపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పోలీసులు సూచించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


