తిమ్మాజిపేట: నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం చేగుంట గేట్ సమీపంలో కేఎల్ఐ ప్రాజెక్టు కాల్వ నుంచి వేల్కిచర్ల గ్రామంతో పాటు పరిసర గ్రామాల ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల రాజేష్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
కేఎల్ఐ కాల్వ ద్వారా సుమారు 1,808 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల రాజేష్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా చేగుంట గ్రామ సమీపంలోని ఐదు గ్రామాలకు ఆయకట్టు భూములకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ తమ నియోజకవర్గంలోని గ్రామాలకు సాగునీరు అందించేందుకు కాల్వ నిర్మాణం కోసం భూములు ఇచ్చి సహకరించిన చేగుంట గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు సాగునీరు అందడంతో వ్యవసాయానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


