అల్వాల్, సెప్టెంబర్ 18: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్ సర్కిల్ పరిధిలోని తుర్కపల్లి డివిజన్ విజయ విహార్ కాలనీలో శ్రీ గణేష్ చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన “జై శ్రీరామ్ భజన్ జామింగ్” కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భక్తులతో కలిసి పాల్గొన్నారు.
భక్తితో ఒక్కటైన విజయ విహార్
భక్తి గీతాలు, జై శ్రీరామ్ నామస్మరణతో కార్యక్రమ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నిర్వాహకులకు ఎమ్మెల్యే అభినందనలు
కార్యక్రమ నిర్వాహకులు కరుణశ్రీ, ఉదయ్ ప్రకాష్‌లను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అభినందించారు. భక్తి, ఆధ్యాత్మికతతో పాటు ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సోదరభావం, ఐక్యతను మరింత పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తోట నరేందర్ రెడ్డి, డోలి రమేష్, డిల్లీ పరమేష్, భాస్కర్ రెడ్డి, నార్ల సురేష్, పవన్, ప్రశాంత్ రెడ్డి, సురేష్, శ్రీధర్ గౌడ్, సాయి, గణేష్, అజయ్, జావీద్, రెహ్మత్ ఖాన్, ఆరిఫ్, దేవేందర్, నాగరాజు, మహేష్, తిరుమల్, పెంటారెడ్డి, భాస్కర్ గౌడ్, యాదగిరి గౌడ్, నర్సింగ్ రావు, సాజిద్, సందీప్, రామకృష్ణ, మణికంఠ, అరుణ్, అభి, ప్రశాంత్, సాయి రాజ్ తదితరులు పాల్గొన్నారు.
పలు కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


