వట్టిపల్లి: గ్రామానికి చెందిన శ్రీ ఎత్తపు ఆర్నాల్డ్, శ్రీ రాము విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందించారు. వట్టిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థులందరికీ సుమారు రూ.15,000 విలువైన నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్తో పాటు ఇతర స్టేషనరీ సామగ్రిని అందజేశారు.
విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రిని అందించడం ద్వారా వారిలో చదువుపట్ల మరింత ఆసక్తి పెంపొందించేందుకు దాతలు చేసిన సేవను పాఠశాల సిబ్బంది అభినందించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది దాతలను శాలువాతో ఘనంగా సన్మానించి, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని దాతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జైపాల్, ఉపాధ్యాయులు శ్రీమతి సుమతి, శ్రీమతి అనూష, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

