మల్కాజ్గిరి: మల్కాజ్‌గిరిలోని సెయింట్ మార్టిన్స్ హైస్కూల్లో నిర్వహించిన HPV వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 14 సంవత్సరాలు నిండిన బాలికలకు HPV వ్యాక్సిన్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, అనంతరం బాలికలకు స్వయంగా HPV వ్యాక్సినేషన్ చేయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు నిండిన ప్రతి బాలికకు HPV వ్యాక్సిన్ వేయించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వైద్యుల సూచనల మేరకు HPV వ్యాక్సిన్ వేయించాలని సూచించారు.
నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న 14 సంవత్సరాలు నిండిన బాలికలకు HPV వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించి, వ్యాక్సిన్ అందించేలా పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రేమ్ కుమార్, మాజీ కార్పొరేటర్లు మేకల సునీత, రాము యాదవ్, జగదీష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, బాలికల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



