నాగర్‌కర్నూల్: ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) నాయకులు డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు పీఆర్సీ నివేదికను తెప్పించాలని, హెల్త్ కార్డులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవనంలో జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీధర్‌రావు అధ్యక్షతన యూనియన్ ప్రత్యేక కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఏఐఎస్టీఎఫ్ ఆడిటర్ ఎం. పర్వత్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ఎస్టీయూ ఆవిర్భవించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లాలో 80వ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇండోనేషియా సమ్మిట్‌లో పాల్గొన్న పర్వత్‌రెడ్డి
ఇటీవల ఇండోనేషియా రాజధాని జకార్తాలో 40 దేశాల ప్రతినిధులు పాల్గొన్న అంతర్జాతీయ విద్యా సదస్సులో ఎం. పర్వత్‌రెడ్డి పాల్గొని తిరిగి వచ్చిన సందర్భంగా ఎస్టీయూ నాగర్‌కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు.
నవంబర్ 14న 80వ వార్షికోత్సవ వేడుకలు
ఎస్టీయూ 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 14వ తేదీన వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీధర్‌రావు, ప్రధాన కార్యదర్శి ఎస్. మధుసూదన్‌రెడ్డి ప్రకటించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యూనియన్ నిరంతరం పోరాడుతుందని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రతినిధులు కే. రమేష్, డి. ప్రభాకర్, కే. రఘురాంరెడ్డి, జిల్లా నాయకులు కర్ణాకర్‌రెడ్డి, సత్యనారాయణ, బాలస్వామి, హనుమంతరెడ్డి, జమీల్ అహ్మద్, మురళి, ప్రవీణ్‌కుమార్, నరసింహ, వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్, మండల బాధ్యులు శివశంకర్, హుస్సేన్, నారాయణ, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


