తొలి కిరణం, సెప్టెంబర్ 24, ఘట్కేసర్ ప్రతినిధి: ఘట్కేసర్ లక్ష్మీనగర్ ప్రాంతంలో మద్యం బాటిళ్లను అక్రమంగా విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో బైరు వెంకటేశ్వర్లు అనే మాజీ సైనికుడి ఇంట్లో 14 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఎక్సైజ్ ఏఈఎస్ ముస్తఫా సిద్దిక్ తన సిబ్బందితో కలిసి ఈ దాడి నిర్వహించినట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లతో పాటు బైరు వెంకటేశ్వర్లును ఘట్కేసర్ ఎక్సైజ్ సీఐ ప్రసాద్‌కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


