చిట్వేల్, ఆగస్టు 24 (తొలి కిరణం న్యూస్): తిరుపతి జిల్లా చిట్వేల్ మండల కేంద్రంలోని కేఎస్ఆర్ అగ్రహారం గ్రామానికి చెందిన మొసాటి మల్లేశ్వరపై హత్యాయత్నం కేసు నమోదైంది. తన రెండో భార్యతో తన తండ్రి మొదటి భార్య కుమారుడైన శివయ్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఈ నెల 19న మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో మల్లేశ్వర, శివయ్యలు పొలానికి ఎరువు తీసుకెళ్తుండగా.. శివయ్య ఎరువు మూటతో ముందుకు వెళ్తున్న సమయంలో మల్లేశ్వర వెనుక నుంచి కొడవలితో అతడి మెడపై పలుమార్లు దాడి చేశాడు. ఈ ఘటనలో శివయ్యకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. అనంతరం మల్లేశ్వర పరారయ్యాడు.
రేణిగుంట డీఎస్పీ ఆధ్వర్యంలో, కోడూరు రూరల్ సీఐ సూచనల మేరకు చిట్వేల్ ఎస్సై ఎస్. వినోద్‌కుమార్ సోమవారం నిందితుడు మల్లేశ్వరను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో నిందితుడిని జైలుకు తరలించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


