మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఖానాజీగూడ లేబర్ అడ్డా (195వ డివిజన్)లో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లింగరుల్ల సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కాలనీ ప్రతినిధులు పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి, భుక్తి, విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని నాయకులు స్మరించుకున్నారు. ఆమె ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేమురురి శ్రీధర్ గౌడ్, కాలేపల్లి సంపత్, మైవాన్, ప్రభాకర్, ఖానా, ఎ.రాజు, శ్రీనివాస్, సాయి, మురళి, నరేష్, సుదర్శన్ కుమార్ మునియా, గుండో అశోక్, జంధార్, ముత్యాలు, బాలరాజు, తిరుమల నగర్ రాజు, రాజేందర్, మేడ్చల్-మల్కాజిగిరి ఎస్సీ, ఎస్టీ సభ్యులు దుంపల శేరినాగిరి తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


