తెలకపల్లి: మండల కేంద్రంలో మల్లికార్జున రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్వో విజయ్ కుమార్ హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోషించిన పాత్ర చిరస్మరణీయమని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల హక్కుల కోసం ఆమె సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మహిళా శక్తికి, ఆత్మగౌరవ పోరాటానికి చాకలి ఐలమ్మ జీవితం నిదర్శనమని తెలిపారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


