నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సుగుణమ్మ, ఉప సర్పంచ్ నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రజక సంఘం నాయకులు తిరుపతయ్య, రమేష్, సీఎం అరుణ్, శంకర్‌తో పాటు గ్రామ రజక సంఘం నాయకులు పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, బహుజనుల హక్కుల కోసం పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. రోకలిబండ, కొడవలి చేతబట్టి దొరల దౌర్జన్యాలను ఎదురించి, పేదల భూముల పరిరక్షణ కోసం ధైర్యంగా పోరాడిన వీరనారి ఐలమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఆమె పోరాట స్ఫూర్తి చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆమె ఆశయాలను నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


