పాలెం: వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి ఉత్సవాలు పాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ పలువురు వక్తలు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు గోవిందు జగదీష్, వైస్ప్రెసిడెంట్ గోవిందు కాశన్న, చాకలి ఎస్సీ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు గోవిందు శేఖర్, పాలెం ఉపసర్పంచ్ గోవిందు శ్రీనివాసులు, గ్రామ సర్పంచ్ బోనాసి రామకృష్ణ, మాజీ ఎంపీపీ పుప్పాల శ్రీనివాస్ గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు జయ కృష్ణ గౌడ్ మరియు వార్డు సభ్యులు అలాగే రజక సోదరులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు, తదితరులు పాల్గొని జయంతి ఉత్సవాలను విజయవంతం చేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


