బిజినపల్లి, సెప్టెంబర్ 26: బిజినపల్లి మండల కేంద్రంలో బీసీ సంఘం మండల అధ్యక్షుడు వేముల సత్యశీల సాగర్ అధ్యక్షతన వీరవనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు ముఖ్య అతిథులుగా హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, బహుజన బిడ్డల వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడిన ధైర్యశాలి చిట్యాల ఐలమ్మ అని కొనియాడారు. దొరలు, భూస్వాములు, దేశ్ముఖ్లు, పటేల్, పట్వారీ వ్యవస్థతో పాటు నిజాం రజాకార్లను ఎదుర్కొని పేదల హక్కుల కోసం పోరాడిన తెలంగాణ వీరవనితగా ఆమెను స్మరించుకున్నారు.
చాకలి ఐలమ్మ చూపిన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని బహుజనుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆమె ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంతటి రాజేందర్ గౌడ్, దాసర్ల వెంకటస్వామి, పచ్చిపాల సుబ్బయ్య, శివశంకర్ యాదవ్, దాసరాజుల శ్రీనివాసులు, నాయినోళ్ల నరేందర్ గౌడ్, సర్పంచ్ ఆంజనేయులు, అతినారపు బాల లక్ష్మయ్య, మహేశ్వర్ రెడ్డి, కూన నిరంజన్, పానుగంటి రామ్ చందర్, వంగ రామన్ గౌడ్, మారేపల్లి శంకర్ గౌడ్, పర్వతాలు యాదవ్, గఫూర్ రఘుబాబు, బెక్కరి శివ, చీర్ణం తిరుపతయ్య, కరిగళ్ళ దశరథం, రామకృష్ణ తదితరులతో పాటు రజక సంఘం, బహుజన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


