బిజినపల్లి (తొలి కిరణం): నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బిజినపల్లిలోని అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు.
దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ అందించిన సేవలను, దేశ అభివృద్ధికి చేసిన కృషిని నాయకులు స్మరించుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో బిజినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిద్దె రాములు, మాజీ సర్పంచ్ తిరుపతయ్య, వట్టెం మాజీ సర్పంచ్ అమృత్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ వాళ్ల నాయక్, నజీర్, బిజినపల్లి ఉపసర్పంచ్ గడ్డమీది మహేష్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ వెంకటస్వామి, మాధురిపేట మాజీ సర్పంచ్, ఉపసర్పంచ్ బాలపిరు, కత్తి ఈశ్వర్, భగవంతు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


