బిజినపల్లి: మండలంలోని మంగనూర్ గ్రామంలో గ్రామ బీసీ సంఘం ఆధ్వర్యంలో బిందేశ్వరి ప్రసాద్ మండల్ 109వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమానికి మండల బీసీ సంఘం నాయకులు వేముల సత్యశీలసాగర్, బీసీ జాగృతి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పల మాసయ్య యాదవ్, గ్రామ అధ్యక్షుడు మ్యాకల యాదయ్య, సర్పంచ్ జాలం నాగయ్య యాదవ్, ఉపసర్పంచ్ బొట్కా చంద్రశేఖర్, వంక వెంకటయ్య తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వేముల సత్యశీలసాగర్ మాట్లాడుతూ.. బీపీ మండల్ బీసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. బీసీలకు 44 శాతం రిజర్వేషన్ల కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. బీసీల హక్కులు, రిజర్వేషన్ల కోసం బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి బీసీలు సంఘటితంగా కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఇండ్ల మల్లికార్జున్, నర్సగల్ల కురుమూర్తి, బొట్కా మహేష్, తోగుట జైరాములు, అప్పలి శ్రీనివాస్, ఎలుక నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


