మల్కాజ్గిరి, సెప్టెంబర్ 2: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పిలుపు మేరకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నేరేడ్మెట్ చౌరస్తాలో బుధవారం భారీ ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
హామీలు ఎక్కడ.. అమలు ఎక్కడ?
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీల పేరుతో ప్రజలకు ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. ప్రస్తుతం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, విద్యార్థినులకు స్కూటీలు, ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో పాటు తులం బంగారం, మహిళలు, యువత, వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఇంకా పూర్తిస్థాయిలో అమలు కావాల్సి ఉందన్నారు.
అదేవిధంగా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా, ఆటో కార్మికుల సంక్షేమం, రైతులకు రైతు భరోసా వంటి హామీల విషయంలోనూ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం
రైతులు, విద్యార్థులు, మహిళలు, యువత, కార్మికులు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.
ప్రజా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, మేకల సునీత, రాము యాదవ్, శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత, అనిల్ కిషోర్ గౌడ్, శిరీష, జితేందర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి, రావుల అంజయ్య, జేఏసీ వెంకన్న, తోట నరేందర్ రెడ్డి, జీకే హనుమంతరావు, అమినుద్దీన్, ప్రభాకర్ గౌడ్, చిన్న యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, ఖలీల్, చిందం శ్రీనివాస్, డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, శ్రీధర్ గౌడ్, లక్ష్మణ్ యాదవ్, భాస్కర్ రెడ్డి, సురేష్, చంద్ర మౌళి, భాగ్య, నందు రావు, శివ గౌడ్, సాయి గౌడ్, సుమన్ గౌడ్, ఫరీద్, చందు, హేమంత్ పటేల్, మారెడ్డి రాజశేఖర్ రెడ్డి, శివసాయి యాదవ్, మాసెట్టి అనిల్, కిరణ్, అల్లి శ్రీనివాస్, కిట్టు, మల్లేష్ యాదవ్, బిక్షపతి, విజయ్ రెడ్డి, జైపాల్ రెడ్డి, మహేష్, రేవంత్ రెడ్డి, పవన్, ప్రశాంత్ రెడ్డి, శరణ్‌గిరి, సందీప్, అరవింద్, అరుణ్, శోభ, ఉష, శిల్ప, అరుంధతి, జ్యోతి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


