పాలెం: శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్వయం ప్రతిపత్తి, పాలెంలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పండ్లు, పూలు తదితరాలకు చెందిన సుమారు 100 రకాల మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థుల్లో మొక్కల పెంపకం, ప్రకృతి సంరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ చైర్మన్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రాములు, ఎన్ఎస్ఎస్ యూనిట్-1 ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సి.నాగరాజు, ఎన్ఎస్ఎస్ యూనిట్-2 ప్రోగ్రామ్ ఆఫీసర్ శివ దొడ్ల, పాలెం గ్రామ సర్పంచ్ బి.రామకృష్ణ, ఉపసర్పంచ్ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ, ఉపాధి హామీ సమన్వయకర్త అభేదా, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


