తొలి కిరణం ప్రతినిధి, వంగూరు: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల కేంద్రానికి చెందిన సల్వాది గేల్వయ్య (70) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు వేనేపల్లి గణేష్ రావు, మాజీ సర్పంచ్ అక్కి లావణ్య ఎల్లాగౌడ్, గ్రామ ఉపసర్పంచ్ బండపల్లి భాస్కర్ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ బాధిత కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు బండపల్లి జంగయ్య, వార్డు సభ్యులు సుమన్, అక్కి మురళీ, నారమోని జంగయ్య, బండపల్లి శివకుమార్, లట్టుపల్లి మురళి, సోషల్ మీడియా ఇన్చార్జ్ ఎల్లికంటి మురళి, బాషమోని కృష్ణ, అయినాల రమేష్, జంపుల మధు, లక్ష్మణ్, రమేష్, బండపల్లి శ్రీశైలం, బుచ్చిరాములు, భాషమోని వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.


